తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత

  • తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
  • ఏపీలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
  • రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలోని నిర్మల్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా, ఏపీలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలోని హన్మకొండలో 46.4, జగిత్యాలలో 46.3, ఆదిలాబాద్‌లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో కృష్ణా జిల్లాలోని కంకిపాడు, మార్కాపురంలోని నందనమారెళ్ల, 46.1 డిగ్రీలు, తణుకులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Heatwave
Andhra Pradesh
Telangana
Temperature
Piduralla
Nirmal
Weather forecast
Heat wave alert

More Telugu News